కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేత.. ఉఖీమర్కు కేదారేశ్వరుడు..!
హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరా
కేదార్నాథ్  ఆలయ


హైదరాబాద్, 23 అక్టోబర్ (హి.స.) ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. శీతాకాలం నేపథ్యంలో భాయ్ దూజ్ పండగ రోజున శాస్త్రోక్తంగా ఆలయ తలుపులను మూసివేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఆలయాన్ని మూసివేయనున్న నేపథ్యంలో పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి సైతం ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం వేకువ జామున 4 గంటలకు ఆలయ తలుపులు మూసివేసే ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత ద్వారాలను మూసివేసి.. పంచముఖి డోలి యాత్ర ఉఖీ మర్కు బయలుదేరింది.

ఆరు నెలల పాటు బాబా కేదార్ ఉఖిమర్లోని ఓంకారేశ్వర్ ఆలయంలో కేదారేశ్వరుడు పూజలందుకోనున్నాడు. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత అనంతరం స్వామివారిన పంచముఖి ఉత్సవ డోలి యాత్రగా తరలించారు. ఈ డోలి యాత్ర సందర్భంగా వేలాది మంది భక్తులు ఇండియన్ ఆర్మీ బ్యాండ్తో కలిసి నృత్యాలు చేశారు. ఈ ఏడాది కేదార్నాథ్ యాత్ర సందర్భంగా 17.39 లక్షల మంది భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande