కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు.తీవ్ర దిగ్భ్రాంతి
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.) కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టి
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు.తీవ్ర దిగ్భ్రాంతి


అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు చనిపోవడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకువెళ్లారు. దీంతో సీఎస్‌తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలను సీఎం తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు, బాధితులకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande