
విజయనగరం, 24 అక్టోబర్ (హి.స.)
,మర్రివలస వంతెనకు వచ్చే ఏడాది శంకుస్థాపన చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. చంపావతి నదిపై వంతెన లేక ఇబ్బంది పడుతున్న విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మర్రివలస గ్రామస్థుల సమస్యలపై ‘స్పందించిన మంత్రి కొండపల్లి ఈ నెల ఒకటిన జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా మర్రివలస సమస్యను తీసుకెళ్లామని ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం స్పందించి మర్రివలస గ్రామానికి మినీ వంతెనకు నిధుల కేటాయింపునకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ