
అమరావతి, 24 అక్టోబర్ (హి.స.)
కర్నూల్ జిల్లా: కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరిన 12 మందిలో ఆరుగురికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ ఇవ్వగా, ఒకరికి తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ