
డిల్లీ, 24 అక్టోబర్ (హి.స.)అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్ ఎవరి ఒత్తిడికీ తలొగ్గదని.. హడావిడి నిర్ణయాలు తీసుకోబోదని స్పష్టంచేశారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ దేశాల ఉన్నతస్థాయి సమావేశంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్ పలు వ్యూహాత్మక విధానాలను అనుసరిస్తోందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు