
చెన్నై/ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.)‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్(Vijay) మళ్ళీ రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే వారం పర్యటన ప్రారంభించాలని విజయ్ భావిస్తున్నారు. ఈ విషయంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమాలోచన చేస్తున్నట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి. గత నెల 27వ తేదీన విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీంతో ఆయన రాష్ట్ర పర్యటన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తాను నిలిపివేసిన పర్యటన మళ్ళీ ప్రారంభించేందుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ ఒకటి రెండు రోజుల్లో వెల్లడికావచ్చని భావిస్తున్నారు. ఈ పర్యటన సమయంలో ప్రజల భద్రతపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు విజయ్ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా రోడ్‌షోలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ