
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం వేధిస్తోంది. దీపావళి దగ్గర నుంచి పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా కోల్పోయింది. దీంతో కాలుష్య నివారణ కట్టడికి రేఖా గుప్తా ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగా తొలిసారి కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు ఏర్పాట్లు చేసింది. బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం చేసిన ప్రయోగం విజయవంతమైంది. దీంతో అక్టోబర్ 29న మొదటి క్లౌడ్ సీడింగ్ జరిగే అవకాశం ఉంది.
బురారీ ప్రాంతంలో కృత్రిమ వర్షం కోసం ట్రయల్ రన్ జరిగింది. కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ఉపయోగించే సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్‌లను విమానం నుంచి కొద్ది మొత్తంలో విడుదల చేశారు. దీంతో గాలిలో తేమ పరిమితంగా ఉందని.. 20 శాతం కంటే తక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ