నాగ్‌ క్షిపణులు.. టార్పెడోలు- రూ.67,000 కోట్ల విలువైన రక్షణ పరికరాల సేకరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం..
ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) ఆపరేషన్‌ సిందూ ర్‌ తర్వాత భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన రక్షణ పరికరాల సేకరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా మరో రూ.79,000కోట్ల విలు
rajnath singh


ఢిల్లీ,24, అక్టోబర్ (హి.స.) ఆపరేషన్‌ సిందూ ర్‌ తర్వాత భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన రక్షణ పరికరాల సేకరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా మరో రూ.79,000కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలు, మిలిటరీ హార్డ్‌వేర్‌ కొనుగోలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) సమావేశంలో.. ట్యాంక్‌ విధ్వంసక గైడెడ్‌ నాగ్‌-2 క్షిపణులు, ఉభయచర యుద్ధ నౌకలకు అవసరమైన ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాం డాక్స్‌, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడోలు, ఎలకా్ట్రనిక్స్‌ ఇంటెలిజెన్స్‌, నిఘా వ్యవస్థలు సహా రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఇంత భారీ మొత్తంలో రక్షణ పరికరాల సేకరణకు ఆమోదం తెలపడం ఇది రెండోసారి. భారత నావికా దళం కోసం.. ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాం డాక్స్‌ (ఎల్‌పీడీ), 30 ఎంఎం నావల్‌ సర్ఫేస్‌ గన్స్‌ (ఎన్‌ఎ్‌సజీ), అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడోలు (ఏఎల్‌డబ్ల్యూటీ), ఎలకో్ట్ర ఆప్టికల్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌ సెర్చ్‌ అండ్‌ ట్రాక్‌ సిస్టమ్‌, 76 ఎంఎం సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌మౌంట్‌ కోసం స్మార్ట్‌ మందుగుండు సామగ్రి కొనుగోలు చే యనున్నారు. ఎల్‌పీడీల సేకరణ వల్ల భారత నావికాదళం.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి ఉభయచర కార్యకలాపాలు చేపట్టేందుకు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande