తిరుపతి. వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి.నదిలో నిన్న జరిగిన దుర్ఘటన లో సహాయక చర్యలు
తిరుపతి ,25 అక్టోబర్ (హి.స.), తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నిన్న (శుక్రవారం) జరిగిన దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదిలో గల్లంతైన చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న బాలు అనే బాలుడి మృతదేహం
తిరుపతి. వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి.నదిలో నిన్న జరిగిన దుర్ఘటన లో సహాయక చర్యలు


తిరుపతి ,25 అక్టోబర్ (హి.స.), తిరుపతి వేదాంతపురం సమీపంలోని స్వర్ణముఖి నదిలో నిన్న (శుక్రవారం) జరిగిన దుర్ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నదిలో గల్లంతైన చిన్నారుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. నిన్న బాలు అనే బాలుడి మృతదేహం లభ్యమవగా.. ఈరోజు ప్రకాష్, తేజు డెడ్‌బాడీలు లభించాయి. దీంతో ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభించాయి. మరో బాలుడు మునిచంద్ర కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా రెస్క్యూ బృందాలతో కలిసి బోటులో వెళ్లి స్వర్ణముఖి నదిలో గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande