కమాండ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన సైబరాబాద్ సీపీ
హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.) చేవెళ్ల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చేవె
సైబరాబాద్ సిపి


హైదరాబాద్, 25 అక్టోబర్ (హి.స.)

చేవెళ్ల పోలీస్ స్టేషన్ కార్యాలయంలో

నూతనంగా ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చేవెళ్ల టౌన్ కాకుండా 20 గ్రామాలలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా రహదారుల పైన జరుగుతున్న ప్రమాదాలను గుర్తించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బీజాపూర్ జాతీయ రహదారిపై 4 సంవత్సరాలలో రిసార్ట్లు, ఫామ్ హౌస్ లు చాలా పెరిగాయి. అందువల్ల రోడ్డు పై రద్దీగా ఉంటుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande