
దాచేపల్లి, 25 అక్టోబర్ (హి.స.)
: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ఘటనలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సు మిర్యాలగూడ నుంచి దాచేపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ