
యాదాద్రి భువనగిరి, 25 అక్టోబర్ (హి.స.) యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ కిచెన్ షెడ్ పనులు నత్తనడక నడుస్తున్నాయని యాదగిరిగుట్ట పంచాయతీరాజ్ ఏఈ పై కలెక్టర్ హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. కిచెన్ షెడ్ పనులను వారం రోజుల్లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల జాప్యం పై అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెడుతున్నారు. లేదా అని పరిశీలించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు