
అమరావతి, 25 అక్టోబర్ (హి.స.)
వాయుగుండం ఆంధ్రప్రదేశ్ తీరం దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ద్వారా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉందని చెప్పారు. ఇవాళ(శనివారం) అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరించారు. రేపటి(ఆదివారం) నుంచి క్రమంగా వర్షాలు పెరుగుతాయని అధికారులు వెల్లడించారు.
వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు పడే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ