ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు
దుబై, 26 అక్టోబర్ (హి.స.) ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని భారీ పక్షుల గుంపు ఢీకొట్టింది. ఈ షాకింగ్ ఘటన సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక బోయింగ్‌ 777-300 (ఫ్లైట్‌ నంబర్‌ SV340) కు చోటు చేసింది. జెడ్డా విమానాశ్రయంలో బోయింగ్ విమానం ల్యాండ్ అవుతుండగా పక్షల
/flock-of-birds-hits-boeing-777-300-487539


దుబై, 26 అక్టోబర్ (హి.స.) ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని భారీ పక్షుల గుంపు ఢీకొట్టింది. ఈ షాకింగ్ ఘటన సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక బోయింగ్‌ 777-300 (ఫ్లైట్‌ నంబర్‌ SV340) కు చోటు చేసింది. జెడ్డా విమానాశ్రయంలో బోయింగ్ విమానం ల్యాండ్ అవుతుండగా పక్షల గుంపు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం మొత్తం పక్షులు రక్తంతో నిండిపోయింది. అలాగే విమానం కొంత భాగం దెబ్బతింది. ఇది గమనించిన పైలట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలోని మొత్తం 200 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ల్యాండింగ్ తర్వాత టెక్నికల్ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించగా.. విమానం ముందు భాగంలో పెద్ద ఎత్తున పక్షులు అవశేషాలు కనిపించాయి. అయితే ప్రమాదం సమయంలో పక్షులు ఇంజన్ లోకి వెళ్లి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande