
హైదరాబాద్, 27 అక్టోబర్ (హి.స.)
అమెరికా కాంగ్రెస్లో సంభవిస్తున్న ప్రాయోజనలపై విభేదాల కారణంగా United States ప్రభుత్వం షట్డౌన్ అయింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ నిబంధనలు తప్పక పాటించాల్సిన డెడ్ లైన్ కు ముందు అవసరమైన ఖర్చుల చట్టబద్ధ అనుమతులను కాంగ్రెస్ అసమగ్రంగా ఆమోదించలేక పోయింది. అలాగే డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, మెడికిడ్ ఖర్చులు, పరీక్షించని సబ్సిడీలు (subsidies) వంటి అంశాలపై తీవ్ర విభేదాలు వచ్చాయి. దీంతో బడ్జెట్ ఆమోదం పొందలేకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్హౌట్ అయింది.
ఈ ప్రభావం వైమానిక రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది. వేతనాలు అందక పోవడంతో వేలాది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఫలితంగా దేశంలోని ప్రధాన 22 విమానాశ్రయాల్లో ఎయిర్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. అనేక ప్రాంతాల్లో టవర్లు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) సమాచారం ప్రకారం, షట్హౌన్ ప్రారంభమైన మూడు రోజుల్లోనే 15 వేలకుపైగా విమానాలు ఆలస్యం కాగా, సిబ్బంది కొరత కారణంగా విమాన నియంత్రణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమాన సిబ్బంది వేతనాల పరిష్కరించకపోతే పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందని విమానయాన సంస్థలు హెచ్చరించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 8 వేల విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. లాస్ ఏంజెల్స్, చికాగో, న్యూ యార్క్, డల్లాస్ వంటి ప్రధాన విమానాశ్రయాలు గందరగోళానికి గురయ్యాయి. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..