విజయవాడ. ఉత్సవ 2025 అరుదైన ఘనత
అమరావతి, 3 అక్టోబర్ (హి.స.) :విజయవాడ ఉత్సవ్-2025 అరుదైన ఘనత సాధించింది. ఉత్సవ్‌లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన కార్నివాల్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి వైబ్రెంట్ ఫర్ సొస
విజయవాడ. ఉత్సవ 2025 అరుదైన ఘనత


అమరావతి, 3 అక్టోబర్ (హి.స.)

:విజయవాడ ఉత్సవ్-2025 అరుదైన ఘనత సాధించింది. ఉత్సవ్‌లో భాగంగా మహాత్మాగాంధీ రోడ్డులో నిర్వహించిన కార్నివాల్.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల నుంచి వైబ్రెంట్ ఫర్ సొసైటీ ప్రతినిధులు సర్టిఫికెట్ అందుకున్నారు. కార్నివాల్‌లో చేపట్టిన భారీ డప్పు ర్యాలీ ఈ రికార్డు సృష్టించినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత ఆయన విజయవాడ ఉత్సవ్ జెండా ఊపి కార్నివాల్‌ను ప్రారంభించారు. అనంతరం అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్నివాల్ విజయవాడ ఉత్సవ్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కార్యక్రమంలో గంటకు పైగా కూర్చుని 40 కళా బృందాల ప్రదర్శనలను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డు సాధించినందుకు విజయవాడ ఉత్సవ్ నిర్వాహకులను సీఎం చంద్రబాబు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande