రాజమండ్రి, 3 అక్టోబర్ (హి.స.)రాజమండ్రిలో గోదావరి నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. అధికారులు దిగువకు దాదాపు 11 లక్షల క్యూసిక్‌లకు పైగా వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ చింతూరు నుంచి శబరి నది కూడా పొంగిపొర్లడంతో గోదావరి ఉధృతి పెరిగింది. వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యానవన పంటలు నీట మునిగిపోగా, పశువులకు పశుగ్రాసం దొరకడం లేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టేకేసట్టిపాలెం, అప్పన్నరాముల లంక కాజువేలు కూడా మునిగిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV