
హైదరాబాద్, 30 అక్టోబర్ (హి.స.)జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ.. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తుండడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి గురువారం బీజేపీ ఫిర్యాదు చేసింది.
అజారుద్దీన్ మంత్రి పదవి అంశంపై తెలంగాణ బీజేపీ బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. సీఈవోతో జరిగిన భేటీలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, బీజేపీ లీగల్ టీం పాల్గొంది. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. అయితే.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఓ వర్గం ఓటర్లను ప్రభావితం చేయడానికేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నియామకాన్ని Model Code of Conduct (MCC) ఉల్లంఘనగా పేర్కొంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు