
దిల్లీ, 30 అక్టోబర్ (హి.స.)
: ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మందికి గాయాలయ్యాయి. వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్‌పుర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కోటబొమ్మాళి, బ్రాహ్మణతర్ల, పలాస ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. స్థానికుల వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు.. బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. జౌన్‌పుర్ కలెక్టర్, వారణాసి విమానాశ్రయ అధికారులు, వైద్యులతో మాట్లాడారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ