మావోయిస్టులు లొంగిపోవాల్సిందే: అమిత్‌ షా
బస్తర్‌, 4 అక్టోబర్ (హి.స.)ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Home Minister Amit shah) ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభు
Amit Shah


బస్తర్‌, 4 అక్టోబర్ (హి.స.)ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా (Home Minister Amit shah) ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో ఇక ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరపదని..ఆయుధాలు వదిలేసి లొంగిపోయేందుకు (Maoists surrender) ముందుకు వస్తే స్వాగతిస్తామన్నారు. ఆ విధంగా లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన వివిధ ప్రయోజనాలు అందిస్తామని..పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బస్తర్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన హోంమంత్రి 2026 మార్చి 31 నాటికి దేశం మావోయిస్టు రహితంగా మారుతుందని పునరుద్ఘాటించారు.

మావోయిస్టులు తమతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని.. ఇప్పుడు వారితో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నించారు. బస్తర్‌ అంతటా ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఆయుధాలతో శాంతికి విఘాతం కలిగించే వారికి భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తాయని మావోయిస్టులను హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande