
సూర్యాపేట, 11 నవంబర్ (హి.స.)
ప్రతి నెల సూర్యాపేట జిల్లా పోలీసులు 100కు పైగా మొబైల్ ఫోన్స్ రికవరీ చేస్తున్నట్లు ఎస్పీ కె.నరసింహ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెల్ఫోన్ రికవరీ మేళాలో వివిధ రూపాల్లో ప్రజలు పోగొట్టుకున్న 102 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత యజమానులకు అందజేసి మాట్లాడారు. ఈ సంవత్సరం 7వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ ను బాధితులకు అందించినట్లు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 2,340 మొబైల్స్ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు.
మంగళవారం రూ.20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందించినట్లు చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు