నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల గడువు పూర్తి
ఆంధ్రప్రదేశ్లో నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అదనంగా కల్పించిన 48 గంటల గడువు పూర్తయింది.
NOMINATION


అమరావతి , 25 అక్టోబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో నాలుగు పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అదనంగా కల్పించిన 48 గంటల గడువు పూర్తయింది. దీంతో రెండు నగరపాలక సంస్థలు, రెండు పురపాలక సంఘాల్లో ఎన్నికల ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంది. తిరుపతి, కడప నగరపాలక సంస్థలతో పాటు రాజంపేట, మైదుకూరు పురపాలక సంఘాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువు ముగిసింది. తిరుపతి నగరపాలక సంస్థలో 66 డివిజన్లు, కడప నగరపాలక సంస్థలో 66 డివిజన్లకు నామినేషన్ల స్వీకరణ పూర్తయింది. అలాగే రాజంపేట పురపాలక సంఘంలోని 32 వార్డులు, మైదుకూరు పురపాలక సంఘంలోని 32 వార్డులకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది.

నామినేషన్ల స్వీకరణ ముగియడంతో ఎన్నికల అధికారులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల అర్హతల నిర్ధారణ అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఈ జాబితాపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో ఎన్నికల ప్రక్రియలో తదుపరి పరిణామాలు కీలకంగా మారనున్నాయి. తుది అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande