వేములవాడలో రహదారి విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.
Whip


రాజన్న సిరిసిల్ల, 25 అక్టోబర్ (హి.స.)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పట్టణంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడంపై అధికారులు దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో 80 అడుగుల రహదారి నిర్మాణానికి చర్యలు చేపడుతుండటంతో కొన్ని ఇళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడనుందని తెలుస్తోంది.

రహదారి నిర్మాణ పనుల కోసం సుమారు రూ.6.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, లైటింగ్ ఏర్పాట్లకు కూడా నిధులు కేటాయించినట్లు సమాచారం. రహదారి విస్తరణకు సంబంధించి రూ.47 కోట్లతో జీవో జారీ చేసి అభివృద్ధి పనులకు మార్గం సుగమం చేసినట్లు పేర్కొంటున్నారు.

రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు పెంచడం, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడం లక్ష్యంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మహంకాళి ఆలయం నుంచి రాజన్న ఆలయం ముందు భాగం వరకు కొనసాగుతున్న రహదారి విస్తరణ పనులను మున్సిపల్ పాలకవర్గం, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande