అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనత.. శ్రీహరికోట నుండి నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి రాకెట్
శ్రీహరికోట, 2 నవంబర్ (హి.స.) అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి నేటి సాయంత్రం ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LV
బాహుబలి రాకెట్


శ్రీహరికోట, 2 నవంబర్ (హి.స.)

అంతరిక్ష పరిశోధనలో భారత్ మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి నేటి సాయంత్రం ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్ దూసుకెళ్లింది. దీనితో

ఇస్రో(ISRO) మరో అరుదైన ఘనతను సాధించింది.ఈ ప్రతిష్టాత్మక బాహుబలి రాకెట్ ను ఆదివారం సాయంత్రం సరిగ్గా 5:26 గంటలకు నింగిలోకి ప్రవేశపెట్టింది. నిప్పులు వెదజల్లుతూ LVM3 -M5 అనే రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 4 వేల కిలోల బరువున్న శాటిలైట్ను తొలిసారి జియో ట్రాన్స్ఫర్ కక్ష్యలోకి పంపింది. భారత గడ్డపై నుంచి ప్రయోగిస్తున్న ఉపగ్రహాల్లో ఇదే అత్యంత బరువైనది కావడం విశేషం. CMS-03 కమ్యూనికేషన్ ఉపగ్రహం పది సంవత్సరాల పాటు కక్ష్యలో పరిభ్రమిస్తూ సేవలు అందించనుంది.

4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రయోగించనున్నారు. ఇది భారతదేశానికి కీలక మైలురాయిగా మారనుంది. LVM3-M5 రాకెట్ దాని పేలోడ్ కారణంగా బాహుబలి అని పిలుస్తున్నారు. 43.5 మీటర్ల పొడవైన రాకెట్ను పూర్తిగా అసెంబుల్ చేసి, ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్కు రవాణా చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande