అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు MLA బంధువులు దుర్మరణం
బాపట్ల, 3 నవంబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్యవతిపేటలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్
/a-horrific-road-accident-at-midnight-four-mla-relatives-died-490239


బాపట్ల, 3 నవంబర్ (హి.స.) రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండల పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సత్యవతిపేటలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణలు కోల్పోయారు. మృతులను కర్లపాలెంకు చెందిన బేతాళం బలరామరాజు (65), బేతాళం లక్ష్మి (60), గాదిరాజు పుష్పవతి (60), ముదుచారి శ్రీనివాసరాజు (54)గా గుర్తించారు. అయితే, ఇదే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలురు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్లకు ప్రాణాపాయం తప్పినట్లుగా వైద్యులు వెల్లడించారు. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కుమారుడి సంగీత్‌ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande