గుట్టల బాటలో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం, 2 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల, ఆళ్లపల్లి, మర్కోడు మధ్యలో సుమారు 10 కిలోమీటర్లు రహదారి గుట్టలు, రాళ్లు, గుంతలతో ఉంటుంది. ఆదివారం పినపాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆక
భద్రాద్రి కలెక్టర్


భద్రాద్రి కొత్తగూడెం, 2 నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగళ్ల, ఆళ్లపల్లి, మర్కోడు మధ్యలో

సుమారు 10 కిలోమీటర్లు రహదారి గుట్టలు, రాళ్లు, గుంతలతో ఉంటుంది. ఆదివారం పినపాకలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకస్మికంగా ఆ రహదారి వెంట ప్రయాణించి ఆశ్చర్యం కలిగించారు. ఆ రహదారి వెంట ప్రయాణించేవారు ఇటువైపు కార్లు వెళ్లలేని దుస్థితి ఉందని చెప్పినా, ఈ రహదారిని పరిశీలించాలని వచ్చానని వారితో చెప్పినట్లుగా తెలిపారు. మండల వాసులు ఈ రహదారిపై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపించి నిర్మిస్తే మేడారం, మణుగూరు, భద్రాచలం, ఛత్తీస్ గఢ్, వరంగల్, ములుగు ప్రయాణాలు సులువుగా కొనసాగుతాయని ప్రయాణికులు అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande