వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్ పై భారత్ ఘన విజయం..!
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) హోబార్ట్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టార్గెట్ 187 పరుగులను భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పూర్తి చేసి మ్యాచ్ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక
క్రికెట్


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)

హోబార్ట్ వేదికగా జరిగిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టార్గెట్ 187 పరుగులను భారత్ 18.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పూర్తి చేసి మ్యాచ్ను 5 వికెట్ల తేడాతో గెలుచుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్రారంభంలో అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్తో భారత బౌలర్లు దూకుడు ప్రదర్శించారు. మొదటి మూడు వికెట్లు తక్కువ స్కోరుకే కోల్పోయిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 186/6 పరుగులు చేసింది. ఇక భారత్ తరఫున అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఆస్ట్రేలియా పరుగుల ప్రవాహాన్ని కొంతవరకు అడ్డుకున్నారు.187 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ప్రారంభంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంది. అభిషేక్ శర్మ (25),

శుభ్మన్ గిల్ (15), సూర్యకుమార్ యాదవ్ (24) ఇన్నింగ్స్తో జట్టు రన్రెట్ను స్థిరంగా ఉంచారు. అయితే

మధ్యలో తిలక్ వర్మ (29), అక్షర్ పటేల్ (17) ఔటయ్యాక మ్యాచ్ సమీకరణ కఠినమైంది. అయితే చివర్లో ఎవరు ఊహించని విధంగా వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు.సుందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులకు నాటౌట్ గా నిలిచాడు. ఇక అతడికి తోడుగా.. జితేశ్ శర్మ (22

నాటౌట్) మంచి సహకారం అందించడంతో అద్భుత భాగస్వామ్యం కారణంగా మ్యాచ్ను భారత్ వైపు తిప్పేశారు.వీరిద్దరూ 43 బంతుల్లో 58 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ విజయంతో సిరీస్ 1. 1 తో సమమైంది

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande