
కోరుట్ల, 21 నవంబర్ (హి.స.)
కోరుట్ల పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని క ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తెలిపారు. పట్టణంలోని ఐలాపూర్ రోడ్డు రహదారిని మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. రహదారి పునరుద్ధరణకు అవసరమైన నిధులను సమీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు