చెంచుల సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం : కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ, 21 నవంబర్ (హి.స.) నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చెంచువాని తండాను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తో కలిసి శుక్రవారం సందర్శించారు. తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ తమ వద్దకే వచ్చినందుకు
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 21 నవంబర్ (హి.స.)

నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం చెంచువాని తండాను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి తో కలిసి శుక్రవారం సందర్శించారు. తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ తమ వద్దకే వచ్చినందుకు చెంచులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ గా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇందులో నల్గొండ జిల్లా, తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ చెంచువాని తండా కు చెందిన ఆదెమ్మ అనే ఒక మహిళా పిటీషన్ ను కలెక్టర్ కు సమర్పించింది. అందులో ప్రధానంగా తమ తండాలో ఆధార్ కార్డులు, వివిధ ధ్రువపత్రాలు లేనందున ప్రభుత్వ పథకాలు అందుకోలేకపోతున్నామని, మారుమూల గిరిజన ప్రాంతంలో ఉండే తమకు ప్రభుత్వ లబ్ధి అందటం లేదని ఉంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande