
నాగర్ కర్నూల్, 21 నవంబర్ (హి.స.)
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట
మండలం పల్కపల్లి గ్రామంలో ఇంటి పెరట్లోనే గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్టు సమాచారం రావడంతో, అచ్చంపేట పోలీసులు గురువారం అర్ధరాత్రి గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఇంటిని పరిశీలించగా, పెరట్లోనే గంజాయి మొక్కలు ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం పల్కపల్లి గ్రామానికి చెందిన నాగనూలు మధు (18) తన ఇంటి పెరట్లో గ్రీన్ కవర్ల మధ్య ఇతరులకు కనిపించకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తున్నాడు. వాటిని స్వాధీనం చేసుకుని మధును అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొక్కల బరువు సుమారు 5 కిలోలు ఉంటుందని పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు