
ఆసిఫాబాద్, 21 నవంబర్ (హి.స.)
కొమరం భీమ్ జిల్లా దహేగాం
బాబు బాబు మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల వారికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పాటు బోనస్ కూడా లభిస్తుందని తెలిపారు. డబుల్ బీటీ రోడ్ నిర్మాణం వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే మండలంలో అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టనున్నామని ఎమ్మెల్యే ప్రకటించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు