సేవలకు మెచ్చి. ఓ కలెక్టర్.పేరే తమ వూరికి నామకరణం
చిత్తూరు, 27 నవంబర్ (హి.స.) సుండుపల్లి: సేవలకు మెచ్చి ఓ కలెక్టర్‌ పేరునే ఆ గ్రామస్థులు తమ ఊరికి నామకరణం చేసుకున్నారు. 1954లో పింఛ జలాశయం నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకా పరిధిలోని గొంది పల్లె మునిగిపోయింది. పునరావాసంల
సేవలకు మెచ్చి. ఓ కలెక్టర్.పేరే తమ  వూరికి నామకరణం


చిత్తూరు, 27 నవంబర్ (హి.స.)

సుండుపల్లి: సేవలకు మెచ్చి ఓ కలెక్టర్‌ పేరునే ఆ గ్రామస్థులు తమ ఊరికి నామకరణం చేసుకున్నారు. 1954లో పింఛ జలాశయం నిర్మాణం చేపట్టారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లా వాయల్పాడు తాలూకా పరిధిలోని గొంది పల్లె మునిగిపోయింది. పునరావాసంలో భాగంగా ఉమ్మడి కడప జిల్లా సుండుపల్లి మండలం ముడుంపాడుత గ్రామం వద్ద 46 కుటుంబాలకు ఇళ్లు, వ్యవసాయ భూములు కేటాయించారు. అందుకు అప్పటి చిత్తూరు జిల్లా కలెక్టర్‌ గోపాలకృష్ణన్‌ ఎంతగానో కృషిచేశారు. ఆయన సేవలకు కృతజ్ఞతగా ఊరి వాసులు తమ గ్రామానికి గోపాలకృష్ణాపురంగా పేరు పెట్టుకున్నారు. పునరావాసం కల్పించిన అధికారి పేరును అలా సదా స్మరించుకుంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande