
అమరావతి, 27 నవంబర్ (హి.స.)
తిరుపతి: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు, వారికి సహకరించిన వ్యాపారులను మాత్రమే ఇప్పటి వరకు అరెస్టు చేసిన సిట్.. తాజాగా తితిదే కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నేతృత్వంలోని సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సుబ్రహ్మణ్యంను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ