
హైదరాబాద్, 28 నవంబర్ (హి.స.)
భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోతోంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై- సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గతేడాది ఇదే కాలానికి 5.6 శాతం వృద్ధి రేటు నమోదైంది. జాతీయ గణాంకాల కార్యాలయం (NSO), స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (MoSPI), జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి స్థూల దేశీయోత్పత్తి (GDP) యొక్క త్రైమాసిక అంచనాలను విడుదల చేసింది.
ప్రపంచ వాణిజ్య అనిశ్చితుల మధ్య బలమైన వినియోగదారుల వ్యయం, తయారీ రంగం కీలక ఇంజన్లుగా వృద్ధిరేటు పెరగడానికి సహకరించాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, వ్యవసాయం సహా కీలక రంగాల్లో పన్నులు తగ్గించడం కూడా వృద్ధికి దోహదపడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..