
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}గువాహటి: /ఢిల్లీ 28నవంబర్ (హి.స.)బహుభార్యాత్వాన్ని నేరంగా పరిగణిస్తూ అస్సాం శాసనసభ ఒక చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం ఈ నేరానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల కారాగార శిక్ష విధించవచ్చు. దీనికి కొన్ని మినహాయింపులు కల్పించారు. ఆరో షెడ్యూలు పరిధిలోని ప్రాంతాల్లో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు ఈ చట్టం వర్తించదు. దీనిపై శాసనసభలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. బహుభార్యాత్వ నిషేధ చట్టం అన్ని మతవర్గాలకూ వర్తిస్తుందని, ఇది కేవలం ఇస్లాంకు వ్యతిరేకంగా తెచ్చింది కాదని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ