బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా
డిల్లీ , 28 నవంబర్ (హి.స.)ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యం
బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా


డిల్లీ , 28 నవంబర్ (హి.స.)ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా భారత బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. నిజానికి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఈ చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చివరి దశలో ఉంది. ఇండోనేషియా త్వరలో భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్‌ను కొనుగోలు చేస్తుందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి ఈ వార్త పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు కచ్చితంగా ఆగ్రహం తెప్పిస్తుంది.

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ – ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి సియామ్‌సుద్దీన్‌కు బ్రహ్మోస్ క్షిపణి షిల్డ్‌ను బహుకరించారు. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించి భారతదేశం – ఇండోనేషియా మధ్య ఒప్పందం ఖరారు అయ్యిందని, ఇక అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం అని సమాచారం. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి వాడకం గురించి ఇండోనేషియా బృందానికి ప్రత్యేక బ్రీఫింగ్ కూడా అందిందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశం అయిన ఇండోనేషియా – భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande