తేజస్వీ యాదవ్ తండ్రి పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడు..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
PM Narendra Modi


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ నవంబర్ 04హి.స.)బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయన ఫోటోలను ఆర్జేడీ పోస్టర్లలో మూలకు ఉంచారని ప్రధాని అన్నారు.

కతియార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకు పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ‘‘జంగిల్ రాజ్‌కే యువరాజ్’’ అంటూ మాట్లాడారు. పెద్ద నాయకుడిగా చెప్పుకునే లాలూ ఫోటోలు ఆర్జేడీ పోస్టర్లపై ఉంచకపోవడంపై మాట్లాడుతూ..జంగిల్ రాజ్ భారాన్ని మోస్తున్నందు వల్లే ఇలా చేస్తున్నాడని అన్నారు. బీహార్‌లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీ కుటుంబం అని, దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్ అని ప్రధాని ఆరోపించారు. తేజస్వీ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అతి కష్టం మీద అంగీకరించిందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande