
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 04హి.స.)దేశవ్యాప్తంగా ఓటరు సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు భారత ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం నుంచి శ్రీకారం చుట్టనుంది. 9 రాష్ట్రాలు, 3యూటీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో 51 కోట్ల మంది ఓటర్లు పాలుపంచుకోనున్నారు. ఈ రెండో దశ ‘సర్’ ప్రక్రియ కిందకు వచ్చే యూటీలు, రాష్ట్రాలు ఏవనేది ఈసీ వర్గాలు వెల్లడించాయి. అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్, పాండిచ్చేరి యూటీ జాబితాలో, ఛత్తీ్‌సగఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లు రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. సర్ ప్రక్రియ అనేక దశల్లో కొనసాగనుంది. ఎన్యుమరేషన్ ప్రక్రియ మంగళవారం మొదలై డిసెంబరు 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాను డిసెంబరు 9వ తేదీన, తుది జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈసీ విడుదల చేస్తుంది. స్వాతంత్య్ర భారతంలో ‘సర్’ ప్రక్రియను ఈసీ చేపట్టడం ఇది తొమ్మిదోసారి. చివరిగా 2002-04 మధ్య చేపట్టింది. మరోవైపు, తమిళనాడులో ‘సర్’ ప్రక్రియను అడ్డుకోవాలంటూ అధికార డీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్ భ
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ