భారత్‌పై దుస్సాహసం చేస్తే దీటుగా బదులిస్తాం  పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు అమిత్‌షా స్పష్టీకరణ
ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా
Amit shah


దర్భంగా, మోతీహరి: , 5 నవంబర్ (హి.స.)భారత్‌పై మళ్లీ దుస్సాహసానికి ఒడిగడితే తూటాకు తూటాతోనే సమాధానమిస్తామని పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు. బిహార్‌లో ప్రతిపాదిత రక్షణరంగ పరిశ్రమల నడవాలో తయారయ్యే పేలుడు పదార్థాలనే ఆ ఉగ్రవాదులపై వాడతామని చెప్పారు. పహల్గాంలో పౌరుల ప్రాణాలు బలిగొన్న ముష్కరులకు వారి నేలపైనే మన సైన్యం దీటైన జవాబు ఇచ్చిందని గుర్తుచేశారు. మంగళవారం బిహార్‌లోని దర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ కుమారుడు తేజస్వి సీఎం కాలేరని, కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ తనయుడు రాహుల్‌ పీఎం కాబోరని చెప్పారు. ఓటు ఎవరికి వేయాలనే విషయంలో బిహార్‌ ఓటర్లు తప్పుచేస్తే హత్యలు, లూటీలు, అపహరణలు, బెదిరింపులు నిత్యకృత్యమవుతాయని హెచ్చరించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande