లుథియానాలో కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య
హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)పంజాబ్‌లోని లుథియానాలో ఓ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. లుథియానా జిల్లాలోని సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్‌ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Lawren
లుథియానాలో కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్య


హైదరాబాద్, 5 నవంబర్ (హి.స.)పంజాబ్‌లోని లుథియానాలో ఓ కబడ్డీ ప్లేయర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. లుథియానా జిల్లాలోని సమ్రాలా బ్లాక్‌లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్‌ సింగ్‌ను దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (Lawrence Bishnoi gang) అన్మోల్‌ బిష్ణోయ్‌ పేరిట సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. గుర్వీందర్‌ సింగ్‌ను తమ గ్యాంగ్‌కు చెందిన కరణ్, తేజ్ చక్ అనే వ్యక్తులు హత్య చేసినట్లే అందులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

ఇదిలాఉండగా ఇటీవల కెనడా (Canada)లో హత్యకు గురైన భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దర్శన్‌సింగ్‌ సహాసిని తామే చంపినట్లు ఇటీవల బిష్ణోయ్‌ గ్యాంగ్‌ (gangster Lawrence Bishnoi) అంగీకరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande