మేరే బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌’
బిహార్లో ప్రధాని ఎన్నికల ప్రచారం
PM Modi


దిల్లీ, 5 నవంబర్ (హి.స.): బిహార్‌లో గత ఇరవై ఏళ్లలో కనీవినీ ఎరగని విజయాన్ని ఎన్డీయే కూటమి ఈసారి సాధించబోతోందని, ఓటర్లు ఆ మేరకు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ‘ఆటవిక రాజ్య’ నేతలు చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బిహార్లో తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ప్రతిచోటా మునుపటి సభ కంటే భారీగా ప్రజలు వస్తున్నారని, ముఖ్యంగా మహిళలు పెద్దఎత్తున పాల్గొంటున్నారని చెప్పారు. బిహార్‌లో భాజపా-ఎన్డీయే మహిళా కార్యకర్తల్ని ఉద్దేశించి మంగళవారం ఆయన నమో యాప్‌ ద్వారా ప్రసంగించారు. ‘మేరే బూత్‌.. సబ్‌సే మజ్‌బూత్‌’ (నా పోలింగ్‌ బూత్‌ అన్నింటికంటే బలమైనది) అనే సంకల్పంతో భాజపా మహిళా కార్యకర్తలు అమోఘమైన కృషి చేస్తున్నారని ప్రధాని ప్రశంసించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande