
విజయవాడ,, 10 డిసెంబర్ (హి.స.), :నకిలీ మద్యం కేసులో వివిధ జైళ్లలో ఉన్న నిందితులకు విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు 18 వరకు రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు, మాజీ మంత్రి జోగి రమేశ్, రాము సోదరులు, తిరుమలశెట్టి శ్రీనివాసరావుతో పాటు కొంతమంది నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్నారు. మొత్తం 17 మంది నిందితులను జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయాధికారి ఎదుట హాజరుపరిచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ