
అమరావతి, 10 డిసెంబర్ (హి.స.)
అమరావతి,: పంచాయతీరాజ్ సిబ్బంది విషయంలో పలువురు సర్పంచ్‌లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (బుధవారం) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సిబ్బందితో మాటా మాంతీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారంటూ పవన్ దృష్టికి పంచాయతీ రాజ్ సిబ్బంది తీసుకెళ్లారు. నెలంతా కష్టపడి పని చేసినా జీతాలు, బిల్లుల విషయంలో కొన్ని చోట్ల సర్పంచ్‌లు ఇబ్బందులు పెడుతున్నారని.. సకాలంలో సంతకాలు చేయకపోవడంతో జీతాలు కూడా అందడం లేదని తెలియజేశారు. సర్పంచ్‌లు చెప్పిన విధంగా పంచాయతీ సెక్రటరీలు పని చేస్తూ సిబ్బందిని, కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని పంచాయతీ రాజ్ సిబ్బంది పవన్‌కు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ