
సత్య సాయి జిల్లా, 10 డిసెంబర్ (హి.స.)
, జిల్లాలో నకిలీ సిమెంట్ పరిశ్రమ బాగోతం బట్టబయలు అయ్యింది. ప్రముఖ సిమెంట్ పరిశ్రమల పేరుతో నకిలీ సిమెంట్ బ్యాగ్‌లు తయారు చేసి సిమెంట్‌ను సరఫరా చేస్తున్న వ్యక్తిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో నకిలీ సిమెంట్ పరిశ్రమ బాగోతం బయటపడింది. అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, భారతి సిమెంట్స్ బ్రాండ్స్ పేరుతో ప్లయాష్‌ను కల్తీ చేసి నకిలీ సిమెంట్ బ్యాగ్‌లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ