
అమరావతి, 10 డిసెంబర్ (హి.స.)
కృష్ణా జిల్లా, డిసెంబర్ 10: సుదీర్ఘ విరామం తర్వాత క్రియాశిల గుడివాడ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని ( ప్రత్యక్షమయ్యారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్నారు కొడాలి. ఎన్నికల్లో ఓటమి, అనారోగ్య సమస్యలతో దాదాపు 18 నెలలుగా ప్రత్యక్ష రాజకీయాలకు మాజీ మంత్రి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని.. గవర్నర్‌కు అందించే వినతిపత్రంలో సంతకం చేశారు. ఆపై వినతి పత్రాలను జిల్లా కమిటీకి అందించే పార్టీ శ్రేణుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ శ్రేణులతో కొడాలి నాని ఉత్సాహంగా మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ