ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రధాన కారణం క్రమశిక్షణ - ప్రధాని
ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) : తాను ఇన్నేళ్ల వృత్తి జీవితంలో ఒక్క అధికారిపైనా కోప్పడిన సందర్భం లేదని, అందుకు కారణం తాను అనుసరించే విధానమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తాను రోజుకి నిద్రపోయేది మూడున్నర గంటలేనని, బయటివారికి ఇది తక్కువగా కనిపించి
Modi


ఢిల్లీ 13,డిసెంబర్ (హి.స.) : తాను ఇన్నేళ్ల వృత్తి జీవితంలో ఒక్క అధికారిపైనా కోప్పడిన సందర్భం లేదని, అందుకు కారణం తాను అనుసరించే విధానమేనని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తాను రోజుకి నిద్రపోయేది మూడున్నర గంటలేనని, బయటివారికి ఇది తక్కువగా కనిపించినా గాఢనిద్రలోకి వెళ్తాను కాబట్టి తనకు పూర్తిగా సరిపోతుందని ఎన్డీయే ఎంపీలతో అన్నారు. గురువారం రాత్రి ఎన్డీయే కూటమి ఎంపీల గౌరవార్థం తన నివాసంలో మోదీ విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని దేవెగౌడ, తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే, ఎన్సీపీ నేత ప్రఫుల్‌ పటేల్, భాజపా సీనియర్‌ ఎంపీలు జగదంబికాపాల్, రవిశంకర్‌ ప్రసాద్‌ తదితరులు ఉన్న టేబుల్‌ దగ్గర ప్రధాని కూర్చొని సుమారు గంటన్నరకుపైగా తన జీవిత అనుభవాలను పంచుకున్నారు.

ఒకసారి గుజరాత్‌లో బాంబుపేలుడు సంభవించినప్పుడు తాను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించడానికి సిద్ధమైతే ప్రతి ఒక్కరూ వద్దని వారించారని, భద్రతా కారణాల రీత్యా జనంలోకి వెళ్లడం మంచిదికాదని హితవు పలికారని, తాను మాత్రం బాధితులను పరామర్శించడంతో పాటు జనంతో నేరుగా మాట్లాడినటు ్లమోదీ చెప్పారు. అధికారంలో ఉండి కష్టకాలంలో బాధితులతో మాట్లాడకుండా భద్రతా కారణాలతో కార్యాలయాలకే పరిమితం కావడం భావ్యంకాదని పేర్కొన్నారు. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండటానికి ప్రధాన కారణం క్రమశిక్షణ, మంచిగా నిద్రపోవడమేనని పేర్కొన్నారు. తాను రోజుకు కేవలం మూడున్నర గంటలే నిద్రపోయినా గాఢనిద్రలోకి వెళ్తానని చెప్పారు. మనం ఎన్ని గంటలు నిద్రపోయామన్నది కాకుండా ఎంత నాణ్యమైన నిద్ర చాలా అవసరం అని అభిప్రాయపడ్డారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande