ఉచితంగా భూములిస్తామంటే నవ్వారు.. ప్రతిష్టాత్మక సంస్థలొచ్చాయి : మంత్రి నారా లోకేష్
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)ఫార్చూన్ ఫైవ్ విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు. భూములిస్తే సంస్థలొస్తాయని ఎగతాళి చేశారు. కానీ నేడు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మ సంస్థలు విశాఖపట్నంకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి న
లోకేష్


అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)ఫార్చూన్ ఫైవ్ విలువ చేసే భూములను ఉచితంగా ఇస్తామంటే కొందరు నవ్వారు. భూములిస్తే సంస్థలొస్తాయని ఎగతాళి చేశారు. కానీ నేడు కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ప్రతిష్టాత్మ సంస్థలు విశాఖపట్నంకు వచ్చాయని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మాన్సాస్, జీఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టును ముఖ్య ఆహ్వానితులుగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, సంస్థలకు ఉచితంగా భూములివ్వాలనే తమ నిర్ణయం వల్లే నేడు ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు ఏపీకి వస్తున్నాయన్నారు. వాటిని ఉత్తరాంధ్రలో భాగమైన విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందనని తెలిపారు.

భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న ఎడ్యుసిటీ కోసం గోవా గవర్నర్ పూసపాటి గజపతి రాజు కుటుంబం భూదానం చేసిందన్నారు. మాన్సాస్ ఎడ్యుసిటీ ఏర్పాటుకు భూమిని కేటాయించారని పేర్కొ్న్నారు. విద్యా రంగం పట్ల పూసపాటి వంశస్తులకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. విద్యా సంస్థల ఏర్పాటుకు వేలాది ఎకరాలు దారాదత్తం చేసిన చరిత్ర వారిదని పేర్కొన్నారు. అయితే ఇందుకు ప్రతిపాదన విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ప్రారంభమైందన్నారు. తాను అక్కడకు వచ్చిన అదితి రాజు తనను ఒక మ్యాప్ తో కలిశారన్నారు. ఉత్తరాంధ్రలో మాన్సాస్ విద్యా సంస్థలకు వేలాది ఎకరాల భూములున్నాయని తెలిపారు. విద్యా రంగం కోసం కావాల్సిన భూములను కేటాయిస్తామన్నారు. ఏవియేషన్ ఎడ్యుసిటీకి భూముల కేటాయింపుకు కూడా అక్కడే బీజం పడిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande