
విశాఖపట్టం, 16 డిసెంబర్ (హి.స.)
విజన్ విత్ యాక్షన్ కెన్ ఛేంజ్ ద వరల్డ్ అనే మాటలు సీఎం చంద్రబాబు నాయుడుకు సరిగ్గా సరిపోలుతాయని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు అన్నారు.
విశాఖలో జీఎంఆర్, మాన్సాస్ ఎడ్యుసిటీ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భీమిలి నియోజకవర్గ పరిధిలో ఎడ్యుసిటీ ప్రాజెక్టును తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ముందుంటారన్నారు. 1995 నుంచి 2004 వరకు హైదరాబాద్ మార్పు చెందిందంటే అందుకు కారణంగా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన పాలనలో సైబరాబాద్ డెవలప్ అయ్యిందని, మైక్రోసాఫ్ట్ ను హైదరాబాద్ కు వచ్చిందని అన్నారు. నేడు ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. నాడే ఐటీ, సీవిల్ ఏవియేషన్ వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారన్నారు. అప్పట్లో సీఎం దిల్లీకి వస్తే అక్కడి మినిస్టర్లు టెన్షన్ పడేవారన్నారు. జీఎంఆర్ ఎయిర్ పోర్టు కోసం నాటి ఏవియేషన్ మంత్రి రూఢీ వద్దకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లి అడిగారన్నారు. దాని ఫలితమే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అని పేర్కొన్నారు. సివిల్ ఏవియేషన్ సంబంధించి యూనివర్సిటీ పెట్టాలని సీఎం భావిస్తున్నారన్నారు.
దేశంలోనే ఇలాంటిది తొలి యూనివర్సిటీ అన్నారు. దాన్ని భోగపురం ఎయిర్ పోర్టుకు అనుసంధానం చేస్తూ భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం గేం ఛేంజర్ కానుందని వివరించారు. విశాఖకు కాగ్నిజంట్ వంటి కంపెనీలు మరో తొమ్మిది వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గూగుల్, మెటా, రిలయన్స్, యాక్సెంచర్ వంటివి ఏపీకి వస్తున్నాయంటే అందుకు సీఎం చంద్రబాబు నాయుడు కారణం అన్నారు. గత వైసీపీ పాలనలో కంపెనీలు ఏపీ అంటే పారిపోయాయన్నారు. మళ్లీ ఏపీ వైపు చూస్తున్నారంటే అది సీఎం చంద్రబాబు దార్శనికత, మంత్రి నారా లోకేష్ ప్రాజెక్టులు అమలు చేసే వేగం వల్లనేనని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV