ప్రధాని మోడీ అభినవ గాడ్సే, నాథూరామ్‌కి వారసుడు.. వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
అమరావతి, 16 డిసెంబర్ (హి.స.) బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ అభినవ గాడ్సే. నాథూరామ్ కి వారసుడు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య
sarmila


అమరావతి, 16 డిసెంబర్ (హి.స.)

బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ అభినవ గాడ్సే. నాథూరామ్ కి వారసుడు అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, నేడు బాపూజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను, స్వాతంత్ర్యపు లక్ష్యాలను, నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ మరో హత్య చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యనే అని, ఇది మహాత్మాకు NDA ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం అని పేర్కొన్నారు. పథకానికి రామ్ - జీ (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీ నీ అవమానించాలని చూసే కుట్ర అని, నరేగా ఆ పథకాన్ని RSS స్కీమ్ గా మార్పు చేస్తున్నారని వెల్లడించారు.

MGNREGA పథకానికి ఉన్నఫళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని ప్రశ్నించారు. ‘100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంపుకు గాంధీజీ పేరు మారుస్తారా ? మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోడీ గారికి దక్కే లాభం ఏంటి ? స్వాతంత్ర్య సమరయోధుల మీద,ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం ?’ అని నిలదీశారు. నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలని, దేశం మొత్తం మోడీ తీరును ప్రతిఘటించాలని, రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande