హనుమంతుడి కంటే గొప్ప దౌత్యవేత్త ఉండరు : జై శంకర్
ఢిల్లీ, 21 డిసెంబర్ (హి.స.) భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలన, రాజకీయాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పుణెలో జరిగిన బుక్ ఫెస్టివల్ లో జై శంకర్ మాట్లాడుతూ.. తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని పే
జై శంకర్


ఢిల్లీ, 21 డిసెంబర్ (హి.స.)

భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, పాలన, రాజకీయాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. పుణెలో జరిగిన బుక్ ఫెస్టివల్ లో జై శంకర్ మాట్లాడుతూ.. తన దృష్టిలో శ్రీకృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని పేర్కొన్నారు. భారత్‌కు వ్యూహాత్మక రాజకీయాలు, రాజనీతీ తెలియవని విదేశీ రచయితలు రాసిన వ్యాఖ్యలను పదే పదే చదివి విసిగిపోయానని, అందుకే భారత సంప్రదాయాల్లోని రాజనీతిని ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నానని చెప్పారు.

రామాయణంలో లంకకు వెళ్లిన హనుమంతుడు సీతకు ధైర్యం నింపి రావణుడిలో భయాన్ని కలిగించిన విధానం గొప్ప దౌత్యానికి ఉదాహరణ అని అన్నారు. అలాగే మహాభారతంలో శ్రీకృష్ణుడు పాండవులు–కౌరవుల మధ్య సంధి ప్రయత్నించి, ధర్మం వైపు నిలబడ్డాడని గుర్తు చేశారు. ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని మోడీ నాయకత్వంలో తాను ముందుకు సాగుతున్నానని జైశంకర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande